ప్రజాశక్తి-పత్తికొండ : పత్తికొండ నియోజకవర్గనికి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో పత్రికా విలేకరుల సమావేశంలోఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ పత్తికొండ ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన టమోటా ప్రాసెసింగ్ ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకొని, ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సీఎం అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారని,10 కోట్ల రూపాయలు విడుదల చేశారనీ తెలిపారు. పత్తికొండ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదనలు సీఎం ముందు ఉంచామని తెలిపారు. క్రిష్ణగిరి మండలం గోకులపాడు వద్ద 7కోట్ల 50 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి సీఎం జగనన్న సుముఖత వ్యక్తం చేయడం క్రిష్ణగిరి మండల ప్రాంత రైతులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని ఆనందంగా చెప్పారు. పత్తికొండ బాలికలకు అధునాతనమైన హాస్టల్ వసతి కల్పించేందుకు నిధులు విడుదల చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు మండల కన్వీనర్ కారం నాగరాజు మాజీ సర్పంచ్ సోమశేఖర్ కో ఆప్షన్ నెంబర్ నజీర్ ఎంపీటీసీ నీలకంఠ వైసిపి నాయకులు నాగరాజు గుండు జిలాన్ వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- సీఎం పర్యటన విజయవంతం చేసిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు : ఎమ్మెల్యే శ్రీదేవి
పత్తికొండ పట్టణంలోని రైతు భరోసా కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో మోహన్ దాసు, తాసిల్దార్ విష్ణు ప్రసాద్, వ్యవసాయ అధికారులకు, ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులకు,డ్వామా అధికారులుకు,పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్తికొండ నియోజకవర్గ ప్రజలందరికీ వైయస్సార్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్రీదేవి కృతజ్ఞతలు తెలియజేశారు.










