Oct 23,2022 15:42

ఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,994 కరోనా కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి మరో నలుగురు మఅతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,28,961కు పెరిగింది. దీంతో ఇప్పటి వరకు నిర్ధారణ మొత్తం కేసుల సంఖ్య 4,46,42,742కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 23,432కు తగ్గింది. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధికి సంబంధించి వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో క్రియాశీలక కేసుల వాటా 0.05 శాతం. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 611 యాక్టివ్‌ కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 4,40,90,349 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.55 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేశారు. కొత్తగా నమోదైన నాలుగు మరణాల్లో ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, మహారాష్ట్ర, నాగాలాండ్‌ నుంచి ఒక్కోటి ఉన్నాయి.