ఇంటర్నెట్డెస్క్ : రాత్రిపూట భోజనంలో పెరుగు తీసుకుంటున్నారా? అయితే ప్రమాదమే అంటున్నారు వైద్యులు. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పెరుగులో కాల్షియం ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పెరుగును అజిర్తి సమ్యలున్నవారు రాత్రిపూట తినకుండా ఉంటేనే మంచిది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే మరి ఏ సమయాల్లో పెరుగు తినాలి అని సందేహిస్తున్నారా? ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో పెరుగు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
- మూత్రపిండాల సమస్యలున్నవారు, అధిక బరువుతో బాధపడేవారు పెరుగును మితంగా తీసుకోవాలి. అలాగే పాలతో తయారుచేసే పదార్థాలను తింటే అలెర్జీ సమస్యలు వస్తుంటే.. వారు తప్పనిసరిగా పెరుగు తినకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.