Oct 21,2023 19:02

నాని తన తదుపరి చిత్ర అప్‌డేట్‌ని ఇచ్చారు. నానితో 'అంటే సుందరానికి' సినిమా తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయతో కలిసి ఆయన తాజా చిత్రం చేయబోతున్నారు. డి.వి.వి ఎంటర్‌టైనమెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దసరా రోజు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 24 నుంచి మొదలుకానుంది.