ప్రజాశక్తి - కోటనందూరు (తూర్పుగోదావరి) :రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి దాడిశెట్టి సత్యనారాయణమ్మ (65) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న మంత్రి విజయవాడ నుంచి హుటాహుటిన తన స్వగ్రామమైన కాకినాడ జిల్లా తుని మండలం సూరవరానికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సత్యనారాయణమ్మకు భర్త, కుమార్తె, కుమారుడు రాజా ఉన్నారు. పలువురు ఎంపిలు, ఎమ్మెల్సీలు, వైసిపి నాయకులు సంతాపం తెలిపారు.










