Oct 22,2022 17:49

మధుమేహం వ్యాధిగ్రస్తులు.. వినికిడి లోపానికి గురవుతారా? అసలు అదెంత వరకు నిజం? వంటి ప్రశ్నలు మెదడుని తొలిచేస్తున్నాయా? అసలే చక్కెర స్థాయిల్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఆహారాన్ని ఆచితూచి తినాలి. ఆపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వినికిడి లోపం కూడా రావొచ్చనే సంకేతాలున్నాయంటే ఎవరికైనా ఒకింత భయం కలగొచ్చు. మరి నిజంగా మధుమేహం వల్ల వినికిడి లోపం వస్తుందా? అనే ప్రశ్నకు.. అవుననే కొన్ని పరిశోధనలు జవాబిస్తున్నాయి.
2008 అధ్యయనంలో మాములు వ్యక్తుల కంటే మధుమేహస్తులకు వినికిడి లోపం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. మధుమేహం వల్ల నరాల, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వినికిడి లోపమొస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే టైప్‌ -1, టైప్‌ -2 అనే తేడా అన్నది స్పష్టంగా పరిశోధకులు పేర్కొనలేదు.
- మీకు వినికిడి లోపంగా అనిపిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
- వైద్యుల సూచనతో వినికిడి పరికరాలు వాడాలి.
తరచూ వైద్యున్ని సంప్రదిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడొచ్చు.