Jan 06,2023 12:09

చిన్నపిల్లల కళ్లలో ఎలాంటి అసౌకర్యం కలిగినా తల్లిదండ్రులు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే చిన్నారులు చూపును కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల కళ్లు పొడిబారడానినికి గల కారణాలేంటి? వంటి విషయాలను తెలుసుకుందామా..!

- చిన్నారులు ఎక్కువసేపు ఫోన్లు, కంప్యూటర్లు చూడడం వల్ల వారి కళ్లు పొడిబారతాయి. దీంతో కొందరిలో మంట లేదా దురదను కలిగిస్తుంది. ఈ సమస్యల వల్ల పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. అందుకే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్‌ పరికరాలను ఉపయోగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- పిల్లల్లో పోషకాహార లోపం కూడా కంటి పొడిబారడానికి దారితీస్తుంది. చిన్నారులకు తగినంత పోషకాహరమందిస్తే కంటి సమస్యలు దరిచేరవు.
- పిల్లలు కళ్లను పదేపదే రుద్దుతుంటే.. సహజ చిట్కాలను ప్రయత్నించండి. ఐదు నిమిషాలపాటు మీ పిల్లల కనురెప్పలకు వెచ్చని లేదా చల్లనిక్లాత్‌ను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత కనురెప్పలను తేలికగా మసాజ్‌ చేయండి. ఇలా చేస్తే కళ్త సహజ తేమను పెంచడానికి సహాయపడుతుంది.
- ఎండ, గాలి, దుమ్ము, ధూళి నుంచి చిన్నారుల కళ్లకు రక్షణ కల్పించేందుకు టోపీ లేదా అద్దాలు వాడాలి.