రాత్రిపూట త్వరగా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించినా.. నిద్ర పట్టడం లేదని చాలామంది చెబుతుంటారు. దానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడేని వైద్యులు చెబుతున్నారు. ఆ ఒత్తిడి తగ్గి.. ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. శ్వాసకు సంబంధించిన ఆసనాల్ని వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆండ్రూ వెయిల్ అనే డాక్టర్ యోగాలోని 'ప్రాణాయామం' ద్వారా మరో టెక్నిక్‌ని కనుగొన్నారు. శ్వాస తీసుకోవడంలో ఈ టెక్నిక్‌కి ఉపయోగించడం వల్ల.. త్వరగా నిద్రపడుతుందని ఆయన సూచిస్తున్నారు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే?
- ఉదయం గానీ, సాయంత్రంగానీ ఎక్కడైనా సరే... మీరు నిటారుగా కూర్చొని ముక్కు ద్వారా గాలిని పీల్చి.. నోటి ద్వారా హుష్.. హుష్ అంటూ శబ్దం చేస్తూ గాలిని వదిలేయాలి. ఇలా చేయడం వల్ల.. మెదడు నరాలు ఉత్తేజితమై రాత్రిపూట త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. .
- మొదటగా ప్రయత్నించేటప్పుడు కేవలం నాలుగుసార్లు ప్రయత్నిస్తే సరిపోతుంది. ఆ తర్వాత పెంచుకుంటూ ఎనిమిదిసార్లు ప్రయత్నించవచ్చట.
- ఇలా శ్వాస తీసుకోవడం అందరికీ తెలిసిందే కదా.. ప్రయోజనం ఏముంటుంది అనుకుంటే పొరపాటేనట. ఇలా చేయడం వల్ల.. అజీర్తి సమస్యలు దూరమవుతాయని వెయిల్ అన్నారు.
- ఈ ప్రయత్నాలు చేసినా.. నిద్ర పట్టకపోతే.. తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుందని, దానికి తగ్గ చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ వెయిల్ చెప్పారు.
-