ప్రజాశక్తి-నందలూరు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం బస్టాండ్ కూడలిలోని వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడికోట ఉష సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీనరసయ్య, రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొబ్బిళ్ళ శ్రీనాథ్, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు అన్నం నాగేంద్ర, సర్పంచ్ జంబు సూర్యనారాయణ, మండల కోఆప్షన్ సభ్యుడు కలీం, గడికోట సుబ్బారెడ్డి, అరిగెల సౌమిత్రి, గుణ యాదవ్, సోమిశెట్టి ప్రభాకర్, నడివీధి సుధాకర్, నరసయ్య, ఆర్ముగం విశ్వనాధ్, నాగ సుబ్బయ్య, షావల్లి, మంచా మురహరి, అరిగే నాని, తదితరులు పాల్గొన్నారు.










