ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరపు అచ్చెన్నాయుడును సోమవారం టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా జగన్ రాజు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు చేశారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం అవినీతి, అరాచక, విధ్వంస పాలనపై పోరాటాలు చేస్తూ పార్టీ అభివృద్ధికి దోహదపడాలని సూచించినట్లు తెలిపారు.