
- ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు
- సామాజిక విప్లవం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం : మంత్రి మేరుగు.నాగార్జున
- మోసం చేసే టిడిపి దొంగలు ముఠా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సామాజిక న్యాయం అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని జిల్లా ఇంఛార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి బుడి.ముత్యాలరావు అన్నారు. సామాజిక సాధికారిత బస్సు యాత్రలో బాగంగా శుక్రవారం డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల పట్ల సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గాలు కలిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకొని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయం చేసిన ఘనత జగన్మోహనరెడ్డిది అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ కార్యక్రమాలను అమలు చేసిన తర్వాత జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి అనేది యాత్ర ద్వారా వివరించనున్నా మని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోగా ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఇబ్బందులు పాలు చేసినటువంటి విషయాన్ని గజపతినగరంలో జరిగే బహిరంగ సభలో వివరించనున్నామన్నారు. .
- రాజ్యాంగ హక్కులు జగన్ తోనే సాధ్యం : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున.
టిడిపి హయాంలో వెనుకబడిన కులాల వారు అసమానతల గురి అయ్యారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు కాలరాయపడ్డాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అవకాశాలను వాళ్లు వాడుకున్నారే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను పట్టించుకొని చరిత్ర చూశామాన్నారు. ఎంత దారుణమంటే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి కుల ప్రస్తావనలు తెచ్చి ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బిసిలకు తోలు తీస్తామని చంద్రబాబు అన్నారంటే ఆయనకున్న సామాజిక న్యాయం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో వాళ్ళ కులాల యొక్క స్థితిలో మెరుగుపడ్డాయో ఆలోచించాలన్నారు. సామాజిక.విప్లవం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమన్నారు.
- దొంగలు ముఠా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి బొత్స సత్యనారాయణ
ఎన్నికలు సమీపిస్తుండటంతో మోసం మాటలు, అబద్ధపు హామీలతో వచ్చే తెలుగుదేశం దొంగలు ముఠా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి ఒక్కటైన అమలు చేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రైతు రుణ మాఫీ చేస్తామని సంతకం పెట్టిన చంద్రబాబు రుణ మాఫీ చేయలేదన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు, బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు, ప్రతి ఇంటికి 20 లీటర్లు తాగునీరు వంటి హామీలు అమలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు మరో 6 హామీలు చెప్పి మరలా మోసం చేసేందుకు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం ఆయా వర్గాలకు చేసిన మేలు, నియోజకవర్గాలు,జిల్లాలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
అంతకు ముందు వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లలో అన్ని వర్గాలు ప్రజలకు ఏమి చేసమనేది తెలియచేయడం జరుగుతుందన్నారు. వెనుక బడిన ప్రాంతమైన మన ప్రాంతంలో ప్రధానంగా విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ది అన్నారు. మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,గిరిజన ఇంజినీరింగ్ కాలేజి ఇచ్చిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిది అన్నారు. బస్సు యాత్ర ప్రజలకు సంక్షేమ పథకాలు గురుంచి వివరించి,.చేసిన అభివృద్ది నీ తెలియచేయడం కోసం బస్సు యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ రీజనల్ ఇంచార్జీ వై వి సుబ్బారెడ్డి,డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి,
ఎంపి బెళ్లనా చంద్రశేఖర్, ఎమ్మేల్యేలు వెంకట చిన అప్పలనాయుడు,బడుకొంద అప్పలనాయుడు,కడుబంది శ్రీనివాసరావు,పాముల పుష్ప శ్రీ వాణీ,అలజంగి జోగారావు,మేయర్ విజయలక్ష్మి పార్టీ నాయకులు పాల్గొన్నారు.