Jul 03,2023 11:27

ప్రజాశక్తి-బి.కొత్తకోట: బి కొత్తకోట నగర పంచాయతీ కార్యాలయం నందు సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఒకటో సచివాలయం కన్వీనర్లు గుమ్మడికాయలు చాంద్ భాష, అంజమ్మ, వారు మాట్లాడుతూ వరుసగా నాలుగోసారి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసి తల్లిలు అకౌంట్ నందు 13 వేల రూపాయలు జమ చేయడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఎంత చేసిన తక్కువేనని నేటి బాలురు  బాలికలు రేపటి పౌరులని ఆలోచన చేసి జ‌గ‌న‌న్న అమ్మ ఒడి' కింద 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగవ ఏడాది అమ్మఒడితో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియ‌ట్‌ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు తుమ్మ గింజల జనార్ధన్,కాలేశా, వాలంటరీలు షఫీ, శ్రీనివాసులు, నరసప్ప, మరియు లబ్ధి పొందిన తల్లులు శ్యామల, తదితరులు పాల్గొన్నారు.