Sep 23,2023 16:45

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మండల స్థాయి క్రీడా పోటీలలో విజ్ డమ్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి సాధించారని కరస్పాండెంట్ డాక్టర్ టి ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అండర్ 17,అండర్ 14 బాలురు బాలికల విభాగాలలో ఖోఖో క్రీడల్లో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని, అలాగే అండర్ 17 బాలికల షాట్ పుట్ విభాగంలో గౌరీ రెండవ స్థానం, అండర్ 14 బాలికల 200 మీటర్స్ పరుగు పందెంలో హిమశ్రీ రెండవ స్థానం అండర్ 14 బాలుర విభాగంలో డిస్కస్ త్రో విభాగంలో సుమన్ రెండవ స్థానం సాధించినట్లు తెలిపారు, అలాగే నియోజకవర్గస్థాయి అండర్ 17 బాలుర విభాగంలో దీక్షత్,మదన్ ఎంపికైనట్లు తెలిపారు, అండర్ 14 బాలుర విభాగంలో మహీదర్, ఉమర్ లు నియోజకవర్గ కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు ప్రదీప్ తెలిపారు. క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరెస్పాండెంట్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు అకాడమిక్ డైరెక్టర్ టి మదన్మోహన్, ప్రిన్సిపాల్ టి ప్రియాంక అభినందించారు.