Nov 19,2023 11:52

వాషింగ్టన్‌ :  ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్‌ హౌస్‌ స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా కృషి కొనసాగిస్తోందని అధికార ప్రతినిధి ఒకరు శనివారం రాత్రి తెలిపారు. ఇజ్రాయిల్‌ మరియు హమాస్‌ కాల్పుల విరమణపై ఇప్పటివరకు ఇంకా ఒప్పందం కుదరలేదని అన్నారు. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది బందీలను దశలవారీగా విడుదల చేసేందుకు గాను ఐదు  రోజుల కాల్పుల విరమణకు సంబంధించి  ఇజ్రాయిల్‌ మరియు హమాస్‌ మధ్య ఖతార్‌ మధ్యవర్తిత్వంతో  ఒప్పందం చేసుకుందని అన్నారు.

''ఇంకా ఒప్పందం జరగలేదు. కానీ మేము ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము'' అని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడ్రియన్‌ వాట్సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబబర్‌ 7న తమ దేశంపై విధ్వంసం సృష్టించిన తర్వాత హమాస్‌ 1200 మందిని బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయిల్‌ ఆరోపిస్తోంది. గాజాపై యుద్ధం ఏడవవారంలోకి ప్రవేశించడంతో.. హమాస్‌ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లోని అధికారులను 5,000 మంది చిన్నారులతో సహా 12,300 మంది మరణించారు. దక్షిణ గాజాపై ఇజ్రాయిల్‌ దాడికి సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది.