Oct 20,2023 15:14
  • క్షీణిస్తున్న ఉద్యోగుల ఆరోగ్యం
  • వైద్య పరీక్షలు చేసిన వైద్యులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకి చేరుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దీక్షలో కూర్చున్న ఉద్యోగులు ఆరోగ్య పరిస్తితి క్షీణించింది. బిపి 160 దాటడం నలుగురు ఉపాద్యాయులు ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యులు వచ్చి బిపి, షుగర్ లెవెల్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి.మోహనరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాద్యాయులు పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఓ పి ఎస్ అమలు చేస్ వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.రెండో రోజు దీక్షకు వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాద్యాయులు దీక్షకు మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా యు టి ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.