Sep 17,2023 11:54
  • పర్యావరణాన్ని కాపాడండి : జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు  

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సకల శుభాలకు ఆది దైవం వినాయకుని చవితి సందర్బంగా జిల్లా ప్రజల అందరికీ జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం అని ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్టానదేవతలను పూజిస్తున్నాం అని తెలిపారు. విఘ్నాలు తొలగించి కార్య సాధనకు కర్తవ్యాన్ని బోధించే వినాయకుని పూజలను అందరూ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలని అభిలాషించారు. చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)  కోరారు.