- 350 మంది క్రీడాకారులు హాజరు
- బాల, బాలికలు జట్లు ఎంపిక పూర్తి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అండర్ 19 ఖోఖో జిల్లా జట్లు ఎంపిక పోటీలు విజవంతంగా జరిగాయి. స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది. వీరి మధ్య పోటీలు నిర్వహించి జట్టుకు 12 మందితో బాల, బాలికలు జట్లు ఎంపిక చేయడం జరిగిందని అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీవీఎల్ ఎన్ కృష్ణ తెలిపారు. ఖోఖో అసోసియేషన్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుల సారథ్యంలో ఎంపిక పూర్తి చేయడం జరిగిందన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ ఆధారంగానే జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన జిల్లా జట్లు 28తేదీ నుంచి నంద్యాల జిల్లాలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్, సీనియర్ వ్యాయామ ఉపాద్యాయులు, జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.
- రాష్ట్ర పోటీలకు పయనమైన అండర్ 19 ఫుట్ బాల్ జట్టు
చిత్తూరు జిల్లాలోని మండపల్లిలో 7 నుంచి 9 తేదీ వరకు జరగనున్న అండర్-19 రాష్ట్ర ఫుట్బాల్ పోటీలకు జిల్లా బాల, బాలికల జట్లు శుక్రవారం పయనమై వెళ్ళాయి. రాష్ట్ర పోటీలకు వెళుతున్న జాట్లుకు అండర్-19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. బాగా ఆడి విజయంతో తిరిగి రావాలని కోరారు.










