Nov 25,2022 22:39

శాన్‌ప్రాన్సిస్కో : ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో ఇప్పటి వరకు పలు అధికారిక ఖాతాలకు బ్లూటిక్‌ మాత్రమే ఉండగా, ఇప్పుడు మరో రెండు టిక్‌లను కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కంపెనీలకు బంగారు రంగు, ప్రభుత్వ ఖాతాలకు ఊదా, వ్యక్తులకు బ్లూ టిక్‌ మార్క్‌లను కేటాయించనున్నట్లు ట్విట్టర్‌ చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. వచ్చే శుక్రవారం నుంచి వెరిఫైడ్‌ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో ఉన్న ఈ టిక్‌ మార్క్‌లను కేటాయించనున్నట్లు తెలిపారు. సెలబ్రిటీలు అయినా కాకపోయినా ఇకపై బ్లూటిక్‌ను కేటాయిస్తామన్నారు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఈ టిక్‌లను కల్పిస్తామనాురు. ఈ టిక్‌లకు ఎనిమిది డాలర్లు ఛార్జ్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్‌ చేస్తామని మస్క్‌ పేర్కొన్నారు.