Jul 07,2023 16:51
  • సిఆర్పిఎఫ్ ఐ జి అజయ్ భర్తన్

ప్రజాశక్తి-కలికిరి : వృక్షాల తోనే వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని సి ఆర్ పి ఎఫ్ ఐ జి అజయ్ భర్తన్ అన్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో పాలెం కొండ సమీపంలో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజయ్ భక్త మాట్లాడుతూ చెట్లు అధికంగా ఉండడం వలన వాతావరణంలో  సమతుల్యంగా ఉండి ప్రకృతి మానవాళికి సహకరిస్తుందని, తద్వారా మానవుని జీవన విధానం సానుకూలంగా సాగిపోతుందని తెలిపారు. మారుతున్న కాలం ప్రభావంతో పరిశ్రమలు పేరుతో చెట్లను అడవులను నరికివేసి మైదానాలుగా మారుస్తున్నారని దానివలన మానవాళికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు చెట్లు, వృక్షాలు నాటడం వలనప్రకృతి మానవునికి సానుకూలంగా మారుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెట్లను నాటి మీరు పోసారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కమాండెత్తులు రాజేష్ కుమార్, నీరజ్ కుమార్, శివప్రసాద్,  సంజీవ్, నంద, సిఆర్పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.