ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలూరుకు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న మురళీకృష్ణకు ముందు ఉన్న కారు డోర్ తీయడంతో కింద పడ్డ మురళీ కృష్ణపై లారీ ఎక్కి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలోని విజయభాస్కర్ సినిమా థియేటర్ సమీపంలో నివాసము ఉంటున్నాడని, నందలూరు రెవెన్యూ కాంప్లెక్స్ సమీపంలోని బాపు జ్యోతిరావు పూలే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని సమాచారం. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










