ప్రజాశక్తి-విజయనగరం కోట : అక్రమ అరెస్టు వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన ర్యాలీలు స్థానిక వీటి అగ్రహారం 35వ డివిజన్ మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా రామారావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిరాధారణ లేని కేసులో ఇరికించి అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆయనను సిఐడి ఫస్ట్ నుంచి విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఈరోజు దేశం వ్యాప్తంగా ఆయనకు ఎంతో మద్దతు వస్తుంది అన్నారు. సైకో పోవాలి చంద్రబాబు రావాలి అని నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ గంగిరెడ్ల శంకర్రావు ఇన్చార్జి పైల మహేష్ యూత్ సెక్రెటరీ దొంగలి సతీష్ ఇంటి సూర్యనారాయణ మిర్యాల శంకర్రావు భక్తులు గురుమూర్తి ఫోటో రమేష్ తదితరులు పాల్గొన్నారు.










