ప్రజాశక్తి-విజయనగరం కోట : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి నేరాలు లేకుండా బయటకు రావాలని ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం పార్వతీపురం(మన్యం) ఉమ్మడి జిల్లాల టిడిపి నాయకులు. ఈరోజు ఉదయం స్థానిక విజయనగరం పట్టణ కేంద్రంలో టిడిపి ఉమ్మడి జిల్లాల నాయకులు స్థానిక కోట వద్ద నుంచి నినాదాలు చేసుకుంటూ మూడ్లు అంతర్ల మీదుగా పైడితల్లమ్మ కోవెల వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిడిపి నాయకులు పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం చేయించి చంద్రబాబు ఆయురారోగ్యాలతో దృఢ సంకల్పంతో ఎటువంటి నేర ఆరోపణ లేకుండా బయటకు రావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జులు జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అందరికీ తెలిసిన విషయమే అయితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబును దెబ్బకొట్టాలని ఉద్దేశంతోనే ఈ రకమైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైల్లో పెట్టించారు మరి అరెస్టు జరిగిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు సురక్షితంగా బయటకు రావాలని నాయకులు ప్రజలు అనేక విధాలుగా మొక్కుకుంటున్నారు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ బెయిల్ పిటిషన్ ఈరోజు జడ్జి ముందుకు రాబోతున్న సందర్భంగా ఆ దేవుడు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది అన్నారు. మేము ఒక్కటే ఆలోచిస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం చంద్రబాబు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు ఏవి పనిచేయకుండా చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయంటే అది ఆయన పరిపాలన విధానం దూరదృష్టే అందుకు నిదర్శనం అన్నారు. ఈ వైసీపీ బూతుల మంత్రులు కొంతమంది పేటియం మంత్రుల బ్యాచ్ మాట్లాడుతున్నారు చంద్రబాబు ₹200 కోట్లు తిన్న ఆర్థిక నేరగాడు అని అంటున్నారు. మరి లక్ష కోట్లు తిన్న నేరగాలను తాత లేక నాన్న లేక పెరెక్సా అమూల్ బేబీ యా అనాలా అని మండిపడ్డారు. మీరు లక్ష కోట్లు తినేశారు మరి ఎవరిని మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు ఏమి అక్రమం చేయలేదు ఆయన్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆ కంపెనీలే బయటకు వచ్చి చెబుతుంటే మీకు సిగ్గు అనిపించలేదా అని ఎద్దేవా చేశారు ఆరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎలాగైతే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ఈరోజు ప్రజలు ఐటి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు మహిళలు స్టూడెంట్స్ దేశ విదేశాల్లో ఉన్న ఉద్యోగులు ఆంధ్ర ప్రజలు అందరూ బయటకు వచ్చి చంద్రబాబు తప్పు చేయలేదు మీరే అక్రమ అరెస్టు చేశారని అంటున్నారని అంటూ ధర్నాలు నిరసనలు చేస్తుంటే సిగ్గు లేకుండా మీరు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పోలీసులకు ఆర్డర్స్ ఇచ్చి మీరు చేస్తున్న పనులు అందరూ గమనిస్తున్నారని అన్నారు. కచ్చితంగా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సైకో పాలనతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఏదైతే అవినీతి అక్రమంతో కూరికిపోయిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంతో ప్రజల తరఫున ముందుకు వెళుతున్నారు అందుకు చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఈ జగన్మోహన్ రెడ్డి వార్వలేక ఏదో ఒక నెపంతో నెట్టాలని చూస్తున్నారు. ప్రైవేట్ ప్రభుత్వ సర్వేలు కావచ్చు 175కి 1075 సీట్లు వస్తాయని సర్వే చూసి భరించలేక సైకో జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టించడం జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రం దేశం వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న ప్రజలు చంద్రబాబు ఆయురారోగ్యాలతో మనోధైర్యం కలగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ అమ్మవారు బుద్ధి కలిగించాలని కోరుతున్నామని అన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూస్తున్నాం ఒక దుర్మార్గుడు 16 నెలల్లో జైల్లో ఉండి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ నిచ్చే అనేక మందిలో నారా చంద్రబాబునాయుడు ఒకరు అలాంటి పెద్ద మనిషిని మిడ్ నైట్ అరెస్టు చేయడం 48 గంటలు రెండు నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా అతనిని విచారణ పేరుతో ఇబ్బంది పెట్టిన వైనం విచారణకరమన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతూ కూర్చుంటే ప్రజలందరూ వచ్చి ఒకటే భరోసా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మేము అండగా ఉంటాం అంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు ఉమ్మడి జిల్లాల నాయకులు అందరూ పాల్గొన్నారు.










