Oct 27,2023 12:53

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో వైకాపా చేపడుతున్న బస్సు వైకాపా యాత్ర బస్సు యాత్ర కాదు తుస్సు అని విజయనగరం టిడిపి పార్లమెంట్ళ అధ్యక్షులు కిమిడి నాగార్జున దుయ్యబట్టారు. శుక్రవారం నాడు స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సమావేశం ముందు ముందుగా పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి అనే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం నాగార్జున మాట్లాడుతూ ఈ వైకాపా ప్రభుత్వం సామాజిక సాధికారిక పేరుతో చేపడుతున్న బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదని అన్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ వైకాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయారు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎస్సీ బీసీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వనందుకా ఈ బస్సు యాత్ర, ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వనందుకా ఈ బస్సు యాత్ర వెనుకబడిన ప్రజలకు ఈ రాష్ట్రంలో ఏం చేశారని ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో ఏమైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారనా ఈ బస్సు యాత్ర, కార్పొరేషన్ లో పెట్టి జీతాలు ఇచ్చుకున్నారే తప్ప ఇంకేమైనా సాధించారా అందుకు బస్సు యాత్ర, టిడిపి హయంలో ఆదరణ పథకం తీసుకొచ్చి పనిముట్లు అందించి వారి పని మెరుగుదల కోసం చేసిన పనులను కూడా పక్కన పెట్టడం జరిగింది. అందుకా ఈ బస్సు యాత్ర, విజయనగరం జిల్లా చైర్మన్ కోట ఎస్సీ మహిళకు వస్తే దాన్ని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన మేనల్లుడు కోసం ఎస్సీ కోటను బీసీ కోటా గా మార్చినందుకు ఈ బస్సు యాత్ర, ఎస్సీ రిజర్వేషన్ చైర్మన్ పదవిని తీసి వారి రిజర్వేషన్ ఎగ్గొట్టి నందుకా ఈ బస్సు యాత్ర ఏ ముఖం పెట్టుకొని ఎస్సీ వాడల్లోకి ఈరోజు వెళ్తారు అని ప్రశ్నించారు, బస్సు యాత్ర చేసే నైతికత మీకు ఉందా అని ప్రశ్నించారు, ఒక విద్యాసంస్థలైన కొత్తదాన్ని తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. నిన్న చేసిన బస్సు యాత్ర ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో చూస్తున్నామన్నారు. గడపగడపకు వైకాపా చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను నుంచి తప్పించుకోవడానికి ఈ బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. ప్రజలు రానున్న రోజులలో బుద్ధి చెబుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, విజయనగరం పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగ్ రావు, గంటా పోలి నాయుడు, కార్యదర్శి బంగారు బాబు, ఏ ఏ రాజు, శ్రీనివాసరావు, విజయనగరం నియోజకవర్గ ఇతర నాయకులు పాల్గొన్నారు.