ప్రజాశక్తి- అనకాపల్లి :ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంవిఆర్ ట్రస్ట్ ద్వారా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పేదలకు తీర్థయాత్రలకు తరలించే కార్యక్రమంలో కొనసాగుతోంది. ఆదివారం అనకాపల్లి ఎంవిఆర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి బయలుదేరే ఎంవిఆర్ తీర్థయాత్ర బస్సులను ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్తీక మాసంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి నుంచి వందలాది మందిని బస్సులో తీర్థయాత్రలకు తీసుకెళ్లి చూపించడం ద్వారా ఎంవిఆర్ ప్రజల మన్ననలు చూరగొన్నారన్నారు. ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎం వి ఆర్ యువసేన, అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.










