Jan 27,2021 20:57

అవార్డు తీసుకుంటున్న డాక్టర్‌

కమలాపురం టౌన్‌ : ప్రభుత్వ హోమియో వైద్యాధికారి షాకీర్‌ హుసేన్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు అందు కున్నారు. షకీలా హుస్సేన్‌ కమలాపురంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ కార్యా లయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, వివిధ గ్రామాలలో శిబిరాలు నిర్వహించి హోమియో వైద్య సేవలను విస్తతం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఆ శాఖ కమి షనర్‌ ఉషారాణి బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు అంద జేశారు. బుధవారం ఆయన ఆ శాఖ ఆర్‌డిడి ఆనందరావు చేతుల మీదుగా అవార్డు అందు కున్నారు. ఈ సందర్భంగా ఆయన కమలా పురంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, రోగు లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తానన్నారు. తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో హోమియో వైద్యశాలను ఏర్పాటు చేశామని ప్రజలు గుర్తించి వైద్య సేవలను పొందాలని పేర్కొన్నారు.