Sep 17,2023 15:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరంలోని పలువురు క్రీడాకారులకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, వైకాపా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్ క్రీడా టీ షర్టులు, ట్రాక్స్ అందజేశారు. ఆదివారం నగరంలోని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో వీటిని ఈశ్వర్ కౌశిక్ అందజేశారు. యువత చదువుతో పాటు, క్రీడల్లోనూ రాణించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.