Oct 01,2023 11:34
  • - కమిషనర్ పి.ఆర్.మనోహర్ వెల్లడి 

ప్రజాశక్తి - బి.కొత్తకోట : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇండియన్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం బి.కొత్తకోట నగర పంచాయతీ,దిగువ బస్టాండ్ కట్ట మీద ప్రారంభించిన తహసీల్దార్ రఫీ అహ్మద్, పలమనేరు వైసీపీ నియోజవర్గం పరిశీలకులు ఖలీల్ అహ్మద్ కలిసి పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించి శుభ్రం చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పి.ఆర్ మనోహర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా తడి,పొడిచెత్త వేరు చేయుట తదితర అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. నగర పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతొ కలిసి ర్యాలీ నిర్వహించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని, తద్వారా బి.కొత్తకోట నగర పంచాయతీని స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అకౌంట్ ఆఫీసర్ బి.రమాదేవి,నగర పంచాయతీ ఆర్ఐ శ్రీనివాసులు, నగర పంచాయతీ ఏఈ రాజేంద్ర, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైసిపి అన్నమయ్య జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్ భాష, షేక్ ముజీరు, మరియు నగర పంచాయతీ సిబ్బంది షమీర్, తేజ, మోహన్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.