Jul 10,2023 22:18
  • అత్యున్నత న్యాయస్థానం వెల్లడి

న్యూఢిల్లీ : ఎలాంటి గుర్తింపు పత్రం (ఐడి ప్రూఫ్‌) లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడి అంశంలో కల్పించుకోలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రిక్విజిషేన్‌ స్లిప్‌, ఐడి ప్రూఫ్‌ లేకుండా రూ.2వేల నోట్ల మార్పిడిని అనుమతించాలన్న ఆర్‌బిఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉపద్యారు అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలాంటి చిరునామా, పత్రాలు లేకుండా రూ. 2,000 నోట్లను నేరస్తులు, ఉగ్రవాదులు మార్చుకుంటున్నారని ఉపధ్యారు ఆరోపణ. తొలుత ఆయన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయగా.. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించగా ఆప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇది కార్యనిర్వాహక విధాన నిర్ణయమని న్యాయస్థానం పేర్కొంది.