Oct 21,2023 16:02
  • కలెక్టరేట్ ఎదుట ఎస్టీ యు ఆక్రందన దీక్ష

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రోపాధ్యాయం సంఘం, (ఎస్టీయూ) విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శనివారం ఆక్రందన దీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. ఎస్టీ యు జిల్లా అధ్యక్షులు వై అప్పారావు ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎస్.టి.యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే జోగారావు  హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ బిల్లులకు సంబంధించి పెండింగ్  బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు వై అప్పారావు  మాట్లాడుతూ ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న పిఎఫ్  నుంచి కూడా అవసరానికి డబ్బులు విడుదల చేయడం లేదని, ఇది చాలా దారుణమని ఇకనైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు జీతాలు చెల్లించడమే భాగ్యంగా భావిస్తుందని, మిగతా బిల్స్ అన్ని కూడా పెండింగ్లో పెడుతుందని,ఇది సరికాదని. ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతేనని. మర్చిపోకూడదన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పీ.ఎఫ్, ఏ పీ.జి.ఎల్.ఐ, సి.పి.ఎస్, సరెండర్ లీవ్ సంబంధించన బిల్స్,మఱియు 11 వ పి.ఆర్.సి ఎరియర్ అమౌంట్  ను తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఎస్టియు చేపట్టిన ఆక్రందన దీక్షకు మద్దతుగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే ఏ వి ఆర్ కె ఈశ్వరరావు  మద్దతు తెలిపారు. దీక్షకుహాజరైన జిల్లా కార్యవర్గ సభ్యులు: సిహెచ్ సూరిబాబు, వి గోవిందరావు,రాష్ట్ర కౌన్సిలర్, రవి,రమణ,రాంబాబు,రామచంద్ర, రమణ, శంకరరావు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.