జెరూసలేం : గాజా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ బాంబు దాడులను నిరసిస్తూ వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంల్లో బుధవారం సమ్మె జరిగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. వెస్ట్ బ్యాంక్ గవర్నరేట్స్‌కు కూడా ఈ సమ్మె వ్యాపించింది. రమల్లా, తుల్కారెమ్, హెబ్రాన్, క్వాల్‌కిలా, నబ్లస్ వంటి నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆస్పత్రిపై దాడిని ఖండించారు. ఈ దాడిలో ప్రధానంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు జెరూసలేంలో దుకాణాలు కూడా మూతపడ్డాయి. హెబ్రాన్ వంటి నగరాల్లో హమాస్ పతాకాలతో నిరసన ప్రదర్శకులు వందలాదిమంది ప్రదర్శనలు నిర్వహించడం వీడియోల్లో కనబడుతోంది.