
ప్రజాశక్తి-బి.కొత్తకోట : శుక్రవారం పెద్దతిప్పసముద్రం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో మురళి, ప్రజల నుంచి వచ్చిన స్పందన అర్జీలు స్వీకరించారు. తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహమ్మద్, తహసిల్దార్ విద్యాసాగర్, ఎంపిడిఒ గిరిధర్ రెడ్డి, జడ్పిటిసి శివయ్య, సర్పంచ్ శంకరప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.