ప్రజాశక్తి-రైల్వేకోడూరు : విద్యార్థులు యువత అందరికీ విద్య ఉపాధి కై పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్.ఎఫ్ఐ పిలుపునిచ్చారు.పట్టణంలోని ఐటి ఐ కాలేజ్ కమిటీని ఏకిగ్రవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి , జిల్లా ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ కరువు కాటకాలతో నిరుద్యోగ యువకులు ఐటిఐ పూర్తి చేసుకొని తగిన ఉద్యోగాల్లేక ఉపాధి కోసం వలస వెళుతున్నారని ఇది తెలిసిన పాలక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించడంలో విఫలంవుతున్నారు. కనీస సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడం లేదన్నారు. కోడూరు ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ, మంగంపేట మైనింగ్ పరిశ్రమ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తద్వారా నిరుద్యోగ యువతకు విద్యార్థులకు గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. వేలాది మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నదన్నారు. కావున విద్యార్థులు యువత అందరికీ ఉచిత విద్య ఉపాధికై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఏకగ్రీవంగా 14 మందిని ఎంపిక చేశారు. ఐటీఐ కాలేజ్ అధ్యక్షడుగా భార్గవ్, కార్యదర్శి వినోద్ ఎస్.ఎఫ్.ఐ సహాయ కార్యదర్శులు లోకేష్ , నవనీత్ ,ప్రవీణ్ ,వెంకట్ ,ఉదయ్ రెడ్డి ఉపాధ్యక్షులు సబ్రణమ్యం ,జీవన్ ,పవన్ ,రణమ , ధనుంజయ్ లను కమిటీ సభ్యులు గా ఎంపిక చేసినట్లు వారి తెలిపారు.










