ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గురజాడ 161వ వర్థంతి సందర్భంగా గురువారం నాడు గురజాడ అప్పారావు విగ్రహానికి సీపీఎం నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గురజాడ అప్పారావు స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న పాలకుల విధానాలును ప్రజలు ప్రతిగ టీoచాలని అందుకు ప్రజలకు అండగా సీపీఎం ఉంటుందని, ప్రజాహక్కులు పరిరక్షణకు సీపీఎంగా
పూనుకుంటామని,గురజాడకు నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాధం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సర్యాన్నారాయణలు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కమిటిసభ్యులు రామమోహన్,.రమణమ్మ, జగన్ సీఐటీయు నగర కార్యదర్శి రమణలు పాల్గొన్నారు.










