- సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
- గోడ పత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా,ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కోరుతూ సిపిఎం ఈ నెల 20 తేదీ నుంచి చేపట్టిన ఉక్కు రక్షణ బైక్ యాత్రను జిల్లాలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ను కార్పొరేట్ దోపిడీదారులకు ఆమ్మెస్తుందన్నారు. ఇప్పటికే ఎల్ ఐ సి,బి ఎస్ ఎన్ ఎల్,రైల్వే తో పాటు అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేయడం, అమ్మేయడం వంటి చర్యలు కు పూనుకుందన్నారు. అందులో భాగంగా నేడు విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేసెందుకు సిద్దమైందన్నారు. అనేక మంది ప్రాణ త్యాగాలు,ఎంతో మంది రైతులు భూ దానం వలన ఏర్పడిన పరిశ్రమ అన్నారు. నేడు ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 2 లక్షలు కుటుంబాలు దానిపై ఆధారంగా బతుకుతున్నాయని అన్నారు. అటువంటి పరిశ్రమను నేడు పోస్కో లాంటి కంపెనీలకు అమ్మేయలని చూస్తుందని దీనిని అడ్డుకోవాలన్నారు. ఉక్కు పరిశ్రమ రక్షించుకోవడం కోసం సిపిఎం కార్మికులుతో పోరాడుతూనే ఉందన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా,ఉక్కు పరిశ్రమ ను కాపాడుకోవడం కోసం సిపిఎం అధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉక్కు రక్షణ యాత్ర పేరుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 20 తేదిన విశాఖ లో ప్రార్భమయ్యే బైక్ ర్యాలీ 20 తేదీ సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం చేరుకుంటుందని అన్నారు. వై జంక్షన్ వద్ద స్వాగతం పలికి అనంతరం కోట జంక్షన్ వరకు బైక్ ర్యాలీ జరిగే అదే ప్రాంతంలో బహిరంగ జరుగుతుందన్నారు. అనంతరం రాత్రి విజయనగరంలో బస చేయనున్నారు. 21 తేదీ ఉదయం నెల్లిమర్ల 10 గం.. చీపురుపల్లి 12 గం.. రాజాం మద్యహం 1.30 గం..ఎచర్ల 4.30 గం. మీదుగా సాయంత్రం 6 గం.లకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కు చేరుకుంటుంది.శ్రీకాకుళం జిల్లాలో 22,23 తేదీల్లో యాత్ర జరుగుతుంది.24 తేదీ న మరలా మన్యం జిల్లాలో కురుపాం.చేరుకొని,పార్వతీపురం,సాలూరు,బొబ్బిలి ,25 తేదిన గజపతినగరం, ఎస్ కోట మీదుగా సాయంత్రం అరుకు లోకి బైక్ ర్యాలీ వెళ్లనుందని తెలిపారు. ఏదైతే ఉక్కు రక్షణ కోసం జరుగుతున్న యాత్రలో అన్ని వర్గాలు ప్రజలు, ఉద్యోగులు, మహిళలు, ప్రజాసంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బైక్ ర్యాలీ గోడ పత్రికను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు,టివి రమణ, పి.శంకరరావు, వి.లక్ష్మి లు పాల్గొన్నారు.










