Dec 13,2020 11:50

          కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి- అరకప్పు, పాలు- కప్పు, పంచదార- కప్పు, యాలకుల పొడి- పావు టీస్పూన్‌, కుంకుమపువ్వు- చిటికెడు, నీళ్లు- రెండు కప్పులు, నూనె- డీ ఫ్రైకి సరిపడినంత.
ఘుమఘుమలాడే గోధుమ స్పెషల్స్‌

                                                        తయారుచేసే విధానం :
          ముందుగా గ్యాస్‌ స్టౌ వెలిగించి దానిమీద గిన్నె పెట్టుకోవాలి. అందులో పంచదార వేసి నీళ్లు పోసుకోవాలి. పంచదార కరిగేంత వరకూ కలుపుతూ పావుగంట మరగనివ్వాలి. తీగపాకం కంటే కొంచెం తక్కువగా వస్తే సరిపోతుంది.
తర్వాత మరొక పాన్‌లో పాలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక గోధుమపిండి వేసి పిండి గట్టిపడి, పాన్‌కు వేరయ్యేవరకూ తిప్పుతూ ఉండాలి. అప్పుడు కొంచెం నెయ్యి వేసి, కలుపుకోవాలి.
తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. పిండిని రెండు నిమిషాలు బాగా కలపాలి.
కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని, గుండ్రంగా ఉండ కట్టకుండా నిలువుగా ఉండ చేసుకోవాలి. తర్వాత చాకు తీసుకుని, సన్నని గాట్లు పెట్టాలి.
మరో పాన్‌లో డీఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ పోసుకోవాలి. అది బాగా వేడెక్కాక ఒక్కొక్క ఉండను నూనెలో వేసి, మీడియం మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బంగారు వర్ణం రాగానే పంచదార పాకంలో వేసి, పది నిమి షాలు నాననివ్వాలి. ఇవి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.