అమరావతి : ఎపి స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి సిఎస్ కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ ప్రస్తావించారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ తోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ కు కూడా నిమ్మగడ్డ లేఖ రాశారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని లేఖలో సూచించారు.










