Jul 12,2023 14:51

ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు మురికివాడల, ప్రజలు అనారోగ్యాలతో సతమతమవుతున్నారు.  వర్షపు నీరు రోడ్లపైకి చేరటం వలన అనేకమంది చిన్న పిల్లలు, ప్రజలు వికలాంగులు వయోవృద్ధులు ఆ మురికి కుంటలో పడి, ప్రయాణం వెళ్లకుండా వెన్ను తిరిగిన రోజులు సంభవిస్తున్నాయి. ఈ నీటిని తొలగించి రోడ్డును బాగు చేయాలని పంచాయతీ అధికారులను, మండల అధికారులకి ఎంత చెప్పినా అధికారుల్లో చీమకుట్టినంత చలనం కూడా లేకుండా ఉంది అని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కనీసం గ్రామ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని జిల్లా అధికారులు అన్న స్పందించి తమకి న్యాయం చేయాలని పలువురు వయోవృద్ధులు వేడుకుంటున్నారు. పంచాయతీ అధికారులు మండల అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో సంవత్సరాలు తరబడి సిమెంటు రోడ్డుపై నీరు నిల్వ ఉంటున్నాయి. గ్రామస్తులు నానా వస్తువులు పడుతున్న ఘటన రెడ్డిపల్లి పంచాయతీలో చోటు చేసుకుంటుంది. అదే పంచాయతీ గ్రామంలో గ్రామ సచివాలయం ఉన్నా కూడా అధికారులు చూస్తూ వెళుతున్నారే తప్ప చర్యలు మాత్రం జీరో అని ప్రజలు తెలియజేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఏం చేయాలో అర్థం కాక గ్రామ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. సిమెంటు రోడ్డుపై పాకుడు పట్టి చిన్నారులు వయోవృద్ధులు నిత్యం ఎవరో ఒకరు జారిపడుతున్నారని గ్రామస్తులు తెలియజేశారు. ఈ సమస్యను పంచాయతీ అధికారులను కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు తెలియజేశారు. ఈ సమస్య మీద ఇంతకుముందే కొన్ని నెలల క్రితం ఇన్చార్జ్ ఎంపీడీవో మరియు ప్రస్తుత ఈవోపీఆర్డి ప్రకాశంను వివరణ కోరగా సమస్యను పరిష్కరిస్తామని ఆనాడే చెప్పారు ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని నెలల క్రితం మురికికుంటలా ఉన్న రోడ్డు ఈనాటికి ఆ మురికికుంటలానే ఉంది.