Sep 29,2023 12:52
  • ఆర్టీసీ డిపో కి  భూమిని చూపిస్తున్న మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్ 

ప్రజాశక్తి - బి.కోతకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట తాత్కాలిక ఆర్టీసీ డిపో నిర్మాణానికి పట్టణంలోని బీసీ కాలనీలోని గంగమ్మ మాన్యంలో డిపో ఏర్పాటుకు పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి అదేశాల మేరకు పనులను ప్రారంభించారు.బి.కొత్తకోట మాజీ ఎంపీపీ ఖలీల్ అహ్మద్ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ బి.కొత్తకోట ప్రజల ఆకాంక్షల మేరకు ఆర్టీసీ డిపోను పునఃప్రారంభించేందుకు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కృషి ప్రశంసనీయమన్నారు.గతంలో అధిక ఆదాయాన్ని గడించిన డిపోల్లో ఒకటిగా బి.కొత్తకోట ఆర్టీసీ డిపో ప్రసిద్ధిగాంచిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కడప జిల్లా జోనల్ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు వైసిపి నాయకులు శ్రీకుర్తి శంకర్ రెడ్డి, వైసిపి పట్టణం కన్వీనర్ రాజన్న, భీమ్ గాని ప్రభాకర్ రెడ్డి, మండల జేఏసీ కన్వీనర్ రెడ్డి హరి, కో-ఆప్షన్ నాసర్,ఎంపీటీసీ రామ సుబ్బారెడ్డి, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.