Jun 05,2023 15:05

ప్రజాశక్తి-ఆదోని : ప‌ట్ట‌ణంలోని ఎంఐజి కాలనీలో ఉన్న మంచి నీటి సంపుకు మరమ్మతులు చేపట్టాల‌ని  సిపిఎం పట్టణ సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, గోపాల్, తిప్పన్న డిమాండ్ చేశారు. సోమ‌వారం ఎంఐజి కాలనీలో ట్యాంకు దగ్గర ఉన్న సంపును సిపిఎం నాయకుల బృందం ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడారు. సంపు పైభాగం సగం పెచ్చులూడి రంధ్రాలు ప‌డింద‌న్నారు. చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాలకు గుర‌య్యే అవకాశం ఉందన్నారు. దుమ్ము, ధూళి, కోతులు, కుక్కలు, పందులు, పక్షులు సంపులో ప‌డి నీరు క‌లుషిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఈ నీటినే ట్యాంకుకు చేరుస్తూ వార్డులకు సరఫరా చేస్తున్నారన్నారు. ఈ క‌లుషిత నీరు తాగి ప్ర‌జ‌లు అనారోగ్యం బారిన ప‌డే ప్ర‌మాద‌ముంద‌న్నారు. గతంలో నీటి కలుషితం వల్ల కొందరు మృత్వాతపడ్డ ఘటనలు ఉన్నాయన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సంపుకు మరుమ్మతులు చేపట్టి ప్ర‌జ‌ల ఆరోగ్యంతోపాటు ప్రాణాలు కాపాడాల‌ని కోరారు. నీటి సంపూ  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి కంచే ఏర్పాటు చేయాలని కోరారు