Dec 25,2022 22:01

 

  • అమలుకు రాజ్యాంగమూ అనుకూలమే
  • అయినా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

న్యూఢిల్లీ : దేశంలో సామాజిక న్యాయం పాలకవర్గ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ఒక ఆయుధంగానే ఉంటున్నది. సామాజిక న్యాయం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే ఆయా పార్టీలు ఎనిుకల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తున్నాయి. తమ చేతుల్లో అధికారం ఉన్నప్పటికీ.. కార్పొరేటు, ప్రయివేటు 'ఉన్నత వర్గాలకు' దాసోహమంటున్నాయి. దీంతో కార్పొరేటు, ప్రయివేటు ఉన్నత వర్గం ఆర్థికంగా మరింత ఎత్తుకుఎదుగుతునుది. కానీ, దేశంలోని అణగారిన వర్గాల ప్రజలు మాత్రం తక్కువ జీతాలు అందే ఉద్యోగాల్లో పనిచేస్తూ తీవ్ర ఆర్థిక అసమానతకు గురవుతున్నాయని సామాజికవేత్తలు, నిపుణులు తెలిపారు.
దేశంలో అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన ఇడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను భారత సర్వోనుత న్యాయస్థానం సమర్ధించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రయివేటు విద్యాసంస్థలు రిజర్వేషన్‌ను అనుసరించే అంశానిు దినేశ్‌ మహేశ్వరి లేవనెత్తారు. ఆ సమయంలో మాత్రం ఈ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదు. దీంతో ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ అంశం అనేది అంతగా జనబాహుళ్యంలోకి రాలేకపోయిందని సామాజికవేత్తలు అన్నారు.
నిజానికి ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌కు భారత రాజ్యాంగమూ సమ్మతిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(5) ప్రకారం ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్‌ను తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి ఉందనిజస్టిస్‌ మహేశ్వరి పేర్కొన్నారు. ''వృత్తిపరమైన విద్య అందించే సంస్థలతో సహా అన్‌ఎయిడెడ్‌ ప్రయివేటు సంస్థలు జాతీయ స్రవంతి నుంచి వేరుగా ఉనుట్టు చూడలేము. ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్లు ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించవు. కాబట్టి, విద్యను అందించే ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్లను ఒక భావనగా తోసిపుచ్చలేము'' అని ఆయన అన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్‌ మినహాయింపు అనేది అణగారిన వర్గాల ప్రజలకుఒక శాపంగా మారిందని నిపుణులు తెలిపారు. భారత్‌లో కులచీలికలు తీవ్రమైన తరుణంలో ప్రయివేటు రంగం అనుభవిస్తున్న రాజ్యాంగ నిరోధక శక్తిపై చర్చించాల్సిన అవసరం ఉన్నదని వారు చెప్పారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తును ప్రయివేటీకరణ విధానాలు దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులకు శాపంగా మారాయని వామపక్షాలు, సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టిల కోసం రిజర్వు చేయబడిన లక్షల ఉద్యోగాలు ప్రయివేటీకరణ కారణంగా కోల్పోయాయని తెలిపారు. ఈ విషయంపై ప్రజలు, విద్యార్థులు, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అజెండాతో పనిచేస్తున్న పాలక పార్టీలను ప్రశిుంచాలనీ, దాని ద్వారానే దేశంలో సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని చెప్పారు.
ఉత్పాదక ఉపాధి, ప్రయివేటు రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలకు సమాజంలోని ప్రత్యేక వర్గాలకు పరిమితమని తేలిందనీ ఆర్థిక వేత్త అశ్వినిదేశ్‌ పాండే, సామాజిక శాస్త్రవేత్తలు కేథరీన్‌, న్యూమాన్‌, సురీందర్‌ ఎస్‌. జోధ్కా చేసిన ఒక అధ్యయనం తేల్చింది. భారతీయ స్టాక్‌ ఎక్స్చేంజీలో జాబితా చేయబడిన టాప్‌ వెయ్యి కంపెనీల నమూనా ఆధారంగా, 2010 అధ్యయనం ప్రకారం, భారతీయ కార్పొరేటు రంగంలో కుల వైవిధ్యం లేదనీ, 65 శాతం భారతీయ కార్పొరేటు బోర్డు సభ్యులు 'ఒక ఉన్నత కుల' సమూహం నుంచి ఉన్నవారేనని వెల్లడికావడం గమనార్హం.
అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు తక్కువ జీతం పొందుతునాుయని తేలింది. వివక్షత, పక్షపాతంతో కూడిన కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ విధానాలు లేకుండా ప్రయివేటు రంగం ఉద్యోగాల్లో అట్టడుగు వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యమనేది సాధ్యం కాదని అధ్యయనం సూచిస్తునుది. ఈ విధానం మారి దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు ప్రయివేటు రంగంలోనూ చక్కని అవకాశాలు రావాలంటే ప్రభుత్వాలు నియంత్రణా చర్యలను అమలు చేయాలని నిపుణులు సూచించారు.