ప్రజాశక్తి-పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండల కేంద్రంలో ఆదివారం జోరు వర్షం కురిసింది. తెల్లారుజామున విపరీతమైన గాలివర్షం రావడంతో ఉదయం నుండి మధ్యాహ్నం. వరకు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు పన్నెండు గంటల ముప్పై నిముషాల నుండి ఉరుములు మెరుపులతో కూడిన గాలి వర్షం కురిసింది. మెయిన్ రోడ్డు పై ఉన్న చెత్త చెదారం, డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలోపలికి చొచ్చుకువచ్చాయి. రెంటల్ హౌసింగ్ కాలనీ సమీపంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వర్షం ప్రారంభం కావడం ఉరుముల శబ్దాలు భయంకరంగా వినిపించాయి. స్థానికులు ఇళ్ల నుండి బయటికి వెళ్లలేని దుస్థితి నెలకొంది.










