Oct 13,2020 21:44

ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

విజయనగరంటౌన్‌ : ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్‌ జీవోలను సవరించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరహారదీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 53 54 జీవోలను సవరించాలని, రేషనలైజేషన్‌లో 1:20 ఉండేటట్లు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, కౌన్సిలింగ్‌ మ్యాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించాలని, 2019 జూన్‌ నుండి జరిగిన అప్‌గ్రేడ్‌, 2018 డీఎస్సీ వారి ప్లేసెస్‌ ఖాళీగా చూపించాలని ప్లేస్‌ సీనియారిటీ ఒక్క పాయింటు ఇవ్వాలని కోరారు. రిలే నిరాహార దీక్ష శిబిరంలో ప్యోప్టో నాయకులు ఎ.సదాశివరావు, బి మహేశ్వరరావు, బుఖారిబాబు, డి రాము, ఎస్‌ ఎన్ని అప్పారావు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.