Oct 12,2020 20:47

దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పి.రఘువర్మ

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : తక్షణమే అక్రమ బదిలీలను ఆపివేసి, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యాన సోమవారం ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఫ్యాప్టో చైర్మన్‌ కె.జోగారావు అధ్యక్షతన ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో చైర్మన్‌ జోగారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే చాలా కాలయాపన చేసిందని, ఇకనైనా షెడ్యూల్‌ విడుదల చేసి ఉపాధ్యాయ బదిలీలు జరపాలని డిమాండ్‌ చేశారు. షెడ్యూల్‌ విడుదలయ్యే వరకూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్యాఫ్టో జిల్లా ప్రధాన కార్యదర్శి బుకారిబాబు, ఎపిటిఎఫ్‌ నాయకులు ఈశ్వరరావు, యుటి ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రమేష్‌ చంద్రపట్నాయక్‌, ఈశ్వరరావు, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు డి.శ్యామ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ని అప్పారావు, గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేష్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు సన్యాసిరాజు,ఆదివాసి ఉపాధ్యాయ సంఘం నాయకులు అమర్నాథ్‌, ఆప్తా నాయకులు మహేశ్వర రావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు వెంకట నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.