
యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'కె.జి.యఫ్ చాప్టర్ 2' ఫైనల్ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సంజయ్ దత్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణంగా ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో క్లైమాక్స్ మినహా మిగతా భాగాన్నంతా పది రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తెలిపారు. క్లైమాక్స్ మాత్రం సంజ య్ దత్ ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతే చిత్రీకరిస్తారని సమాచారం. ప్రభుత్వ విధి విధానాలను పాటిస్తూ ఎంటైర్ యూనిట్‌ను తగు జాగ్రత్తల్లో ఉంచి చిత్రీకరణ పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు.