రెడ్డిగుంటలో పర్యటిస్తున్న జెసి
రెడ్డిగుంటలో జెసి పర్యటన
ప్రజాశకి -గూడూరు :మండలంలోని రెడ్డిగుంట గ్రామంలో సోమవారం జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు.తొలుత స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ భూములను పరిశీలించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు వందేళ్ల తర్వాత భూముల రీసర్వే జరుగుతుందన్నారు. వ్యవసాయ పొలాలు , గ్రామ కంఠ వంటి తదితర భూములను సర్వే చేసి హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ గోపాలకష్ణ , రెవెన్యూశాఖ ఏడీ ప్రసాద్ , డిప్యూటీ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ ,తహశీల్దార్ లీలారాణి పలువురు అధికారులు ఉన్నారు.










