ప్రజాశక్తి-రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావ్ పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమసమాజ నిర్మాణం కోసం, కుల మత భేధాలు లేకుండా భారతీయులందరి ఐఖ్యత కోసం పాటుబడిన వ్యక్తులు పూలే దంపతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం సర్పంచ్ మల్లాది రాణి, కూనపరాజుపర్వ సర్పంచ్ మాతంగి వెంకటేశ్వరరావు,తహసీల్దార్ పాల్, ఎంపిడిఓ పి శంకరరావు, గ్రామ కార్యదర్శి డాక్టర్ వి రవి కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బలగాని తిరుపతిరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి, రామినేని వీరస్వామినాయుడు, వెంకటరెడ్డి, తోటకూర రవి బాబు తదితరులు పాల్గొన్నారు.










