Sep 24,2023 15:51
  • పెచ్చులూడుతున్నా పట్టించుకునే వారు కరువు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ఉన్న పోర్టు కోలు ప్రమాధకరంగా మారాయి. ఎప్పుడు ఎవరి మీద  పోర్టు కో నుంచి స్లాబ్ పెల్లలు ఊడి మీద పడతాయి అనే భయంతో ఉద్యోగులు,వాహన డ్రైవర్లు ఉన్నారు. జిల్లా కలెక్టరేట్ కు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద, ఆబ్కారీ శాఖ వద్ద, ఖజానా శాఖ వద్ద, జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద, ఎపి జి ఎల్ ఐ కార్యాలయం వద్ద పోర్ట్కోలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, జెసి.వెళ్ళే ప్రధాన మార్గం వద్ద ఉన్న పోర్టు కో కుడి వైపున స్లాబ్ పెచ్చులు ఊడి వేలాడుతున్నాయి. దీంతో అక్కడ వాహనాలు ఉంచేందుకు, దాని కింద నుంచి వెళ్లేందుకు ఉద్యోగులు వాహన డ్రైవర్లు భయపడుతున్నారు. మరో వైపు ఏ రోజు ఏ మంత్రి,రాష్ట్ర అధికారులు వస్తారో తెలియదు. వాళ్ళు వచ్చే వాహనాలు సరిగ్గా అక్కడే ఆగి దిగుతుంటారు.ఎవరి మీద ఎప్పుడు పెచ్చులు ఊడి పడతాయోనని భయంతో వచ్చే వాహన డ్రైవర్లు ఉంటున్నారు. మరో వైపు ఆబ్కారీ శాఖకు వెళ్ళే పోర్టు కో, ఖజానా శాఖ, ఎపి జిఎల్ఐ శాఖ వద్ద ఉన్న పోర్టు కోలు పెచ్చులు ఊడి ప్రమాదకరంగా ఉన్నాయి.వర్షాకాలం కావడంతో పోర్టు కోలు వర్షానికి నాని పెచ్చులు ఎవరి మీద పడతాయో అనే భయంతో ఉద్యోగులు ఉంటున్నారు. పోర్టు కో కింద నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు చూసుకొని వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. వెంటనే జిల్లా యంత్రాంగం తగిన జాగ్రత్తలు ,చర్యలు తీసుకోకుంటే ప్రమాదాలు జరగకుండా నిలువరించే అవకాశం ఉంటుంది.