Jul 10,2023 16:39

ప్రజాశక్తి-సుండుపల్లి : అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని  రాచమాండ్ల పల్లె అడవి మార్గంలో పందులు స్కూటర్కు ఢీకొట్టడంతో దేవారెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తిమ్మారెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత పని మీద రాయచోటికి బయలుదేరి వెళుతుండగా అడవి మార్గంలో వెళ్లేసరికి పందులు గుంపుగా రావడం జరిగిందని, స్కూటర్ ను ఢీకొట్టడంతో వెంటనే ఆ వ్యక్తి కింద పడి గాయాలైనట్లు ముఖం మీద ఎక్కువ దెబ్బలు కావడంతో అక్కడున్న చేరుకున్న వ్యక్తులు వెంటనే అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ నుండి సీరియస్ గా కావడంతో తిరుపతి హాస్పిటల్కు చేర్చినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా ఈ అడవిలోనే కొంతమంది స్కూటర్లకు ఢీ కొట్టుకొని గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు.   ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని చుట్టుపక్క గ్రామాల ప్రయాణికులు తెలిపారు