Oct 27,2023 10:44
  • వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరెస్ట్....
  • సోమందేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు....

ప్రజాశక్తి-పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని మడకశిర రోడ్డులోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు లేని  నిరుపేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని అక్కడే గత కొన్నినెలాలుగా నివాసం వుంటున్నారు. శుక్రవారం ఉదయం రెవిన్యూ అధికారులు, పోలీసులు, గుడిసెల వద్దకు చేరుకొని పేదలు వేసుకున్న గుడిసెలును బలవంతంగా తొలగించి గుడిసెల తొలగింపును అడ్డుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు తదితరులను అరెస్ట్ చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.అంతకు ముందు సిపిఎం నాయకులు హరిని పోలీసులు ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుండి నాయకులను సోమందేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇదిలా వుండగా పేదలు గుడిసెల తొలగింపును అడ్డుకున్నారు.తాము ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాటిని నిర్ధాక్షిన్యంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు  ఇళ్లు లేని తాము ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే అధికారులు కక్షగట్టి వాటిని తొలగించారన్నారు. తమకు నిలువనీడ లేకుండా చేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల పై ప్రజలు మండిపడ్డారు.