Nov 04,2020 21:41

సమావేశంలో మాట్లాడుతున్న రేఖ గౌడ్‌

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు : ప్రజా సమస్యల పరిష్కారారికి ఉద్యమించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి రేఖాగౌడ్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, వర్షాకాలం, వేసవికాలమనే తేడా లేకుండా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా గ్రామాల్లో సిసి రోడ్లు లేక రహదారులు అస్తవ్యస్తంగా మారాయని చెప్పారు. జనసేన నియోజకవర్గ మీడియా ఇన్‌చార్జి గానిగ బాషా, నాయకులు రాహుల్‌ సాగర్‌, గాజుల వెంకటేష్‌, రవి ప్రకాష్‌, షబ్బీర్‌, ఉపేంద్ర పాల్గొన్నారు.